నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లోని ఆవరణలో పేద స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ : ఎంపీ మల్లురవి

నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లోని ఆవరణలో పేద స్టూడెంట్లకు సైకిళ్ల పంపిణీ : ఎంపీ మల్లురవి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : విద్యార్థుల సంక్షేమానికి మరో ముందడుగు వేశారని ఎంపీ మల్లురవి తెలిపారు. సోమవారం కలెక్టరేట్​లోని ఆవరణలో ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేశ్​ రెడ్డి తో కలిసి పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. 

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అంగన్​వాడీ  నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు త్వరలోనే  షూలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.