కల్వకుర్తి, వెలుగు: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని బీఎస్‌ఎన్‌ఎల్ గ్రౌండ్‌లో శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 16 రోజుల పాటు నిర్వహించే ఆయుత చండీ విశ్వశాంతి మహాయాగం ఆదివారం ప్రారంభమైంది. ఆగస్టు 3వరకు ఈ మహాయాగం కొనసాగనుంది.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్నమాల, భక్తులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ విశ్వశాంతి, లోకకల్యాణం, ప్రజల ఆయురారోగ్యాల కోసం ఈ మహాయాగాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యాగంలో పాల్గొనడం ద్వారా ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కల్వకుర్తిలో ఇంతటి విశిష్టమైన మహాయాగం నిర్వహించడం అదృష్టమన్నారు.
