మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలోనే జాతీయ సదస్సు నిర్వహించాలని లేకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని పీయూ విద్యార్థులు అధికారులను హెచ్చరించారు. కొద్దిరోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులు ఆదివారం యూనివర్సిటీ జేఏసీ నాయకుడు సాయి ఆధ్వర్యంలో మధ్యాహ్నం భోజనం సమయంలో పీయూలోని ఫార్మసీ హాస్టల్ ముందు నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ పాలమూరు జిల్లా, యూనివర్సిటీ ఖ్యాతి పెంచే ఇంత పెద్ద సెమినార్‌ను ఇక్కడే నిర్వహించేలా వర్సిటీ అధికారులు, రాజకీయ పార్టీలు కృషి చేయాలన్నారు. పాలమూరు యూనివర్సిటీలో అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని, అధికారుల తప్పులను కప్పిపుచ్చుకునేందుకే జాతీయ సెమినార్‌ను రంగారెడ్డి జిల్లాకు తరలించారని ఆరోపించారు.
