నారాయణపేట, వెలుగు: ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థిత పజ్ఞ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా కేంద్రంలో యూనియన్ ఆధ్వర్యంలో జనజాగరణ యాత్ర బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం నూతన పెన్హన్ విధానం వల్ల ప్రయోజనం ఏమీ లేదన్నారు. 30 ఏళ్లు సమాజానికి సేవ చేసిన టీచర్‌కు వృద్ధాప్యంలో కేవలం రూ.3 వేలు పెన్హన్ వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 23న నిర్వహించే చలో హైదరాబాద్ మహాసభకు ప్రతి సీపీఎస్ ఉద్యోగి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ట్రెజరర్ నరేశ్, రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వాల్ శ్రీకాంత్, నారాయణపేట జిల్లా అధ్యక్షుడు కృపాకర్ రెడ్డి, రాఘవేంద్రాచారి, ఎం.నరసింహారెడ్డి, ఎం.జనార్దన్ రెడ్డి, కృష్ణారెడ్డి, దామోదర్, నరసింహ పాల్గొన్నారు.
