హైదరాబాద్ సిటీ నడి రోడ్డుపై భారీ గొయ్యి.. కుంగిపోయిన కొత్త రహదారి

హైదరాబాద్ సిటీ నడి రోడ్డుపై భారీ గొయ్యి.. కుంగిపోయిన కొత్త రహదారి

హైదరాబాద్ సిటీలో షాకింగ్.. మొన్నటికి మొన్న కొత్తగా వేసిన రోడ్డు ఒక్కసారిగా కుంగిపోయింది. పెద్ద గొయ్యి ఏర్పడింది. ఈ ఘటన హైదరాబాద్ హయత్ నగర్ లో ప్రధాన రహదారిలో జరిగింది. హిందూస్తాన్ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న రోడ్డు.. ఈ విధంగా కుంగిపోయింది. విశేషం ఏంటంటే.. ఈ రోడ్డున ఇటీవలే కొత్త వేశారు. ఇంతలోనే రోడ్డు కుంగిపోవటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

ఆరు అడుగుల లోతులో.. ఐదు అడుగుల వెడల్పులో హయత్ నగర్ మెయిన్ రోడ్డుపై ఇంత పెద్ద గొయ్యి ఏర్పడటం కలకలం రేపుతోంది. నిత్యం లక్షల మంది జనం ఈ రోడ్డులో రాకపోకలు సాగిస్తుంటారు. గొయ్యి ఏర్పడిన సమయంలో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ పోలీసులు స్పందించారు. బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆర్ అండ్ బీ అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చారు. 

గొయ్య ఎందుకు ఏర్పడింది.. కారణాలు ఏంటీ అనేది అధికారులు పరిశీలిస్తున్నారు. ఇటీవల కాలంలో కొత్తగా రోడ్డు వేశారు. అప్పడు కూడా బాగానే ఉందని.. అకస్మాత్తుగా ఇంత పెద్ద గొయ్యి ఏర్పడటంపై స్థానికులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.