
తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కామారెడ్డి,మెదక్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ ఊరు చెరువు నిండి పొంగిపొర్లడంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రధాన రహదారి మునిగిపోయింది.
పెట్రోల్ బంకులు, రోడ్డుకు ఇరువైపుల లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. రోడ్లపై నీళ్లు చేరడంతో కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందిపడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ను క్లియర్ చేశారు.
మరో వైపు ఆగస్టు 27 రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. నిర్మల్ ,నిజామాబాద్ ,కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, జోగులాంబ గద్వాల్, కరీంనగర్, ఖమ్మం, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.