హైదరాబాద్, వెలుగు: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీఏ) విడుదల చేసిన జేఈఈ మెయిన్ 2026 సెషన్–-1 ఫలితాల్లో శ్రీచైతన్య విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. విద్యాసంస్థలకు చెందిన స్టూడెంట్ పసల మోహిత్ జాతీయ స్థాయిలో 300/300 మార్కులు సాధించి సత్తాచాటాడు. 100 పర్సంటైల్‌తో దేశంలోనే అత్యుత్తమ స్కోరు సాధించిన ఏకైక విద్యార్థిగా నిలిచాడు. ఇదే బాటలో భారీ సంఖ్యలో విద్యార్థులు 290, 285, 280 మార్కులు సాధించి సత్తా చాటారు. విద్యార్థులు సాధించిన మార్కులపై శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వరుసగా నాలుగేండ్లు జేఈఈ మెయిన్ లో 300కి 300 మార్కులు సాధించడానికి తమ సంస్థ రూపొందించిన అకడమిక్ ప్రోగ్రామ్స్, షెడ్యూల్స్, అంతర్గత పరీక్షలు ప్రధాన కారణమని తెలిపారు. మారుతున్న జనరేషన్, టెక్నాలజీని అనుసరిస్తూ శిక్షణలో తాము తెచ్చిన విప్లవాత్మక మార్పులకు ఈ ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ‘ఇన్ఫినిటీ లెర్న్’ ఆన్‌లైన్ యాప్, దేశంలోని అత్యుత్తమ అధ్యాపక బృందం అందించిన శిక్షణ విద్యార్థులను విజేతలుగా నిలబెట్టాయని ఆమె కొనియాడారు.
