కేఏ పాల్ ఆధ్వర్యంలో  గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్

కేఏ పాల్ ఆధ్వర్యంలో  గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్
  • ఈ నెల 22న చెన్నైలో నిర్వహణ
  • వివరాలు వెల్లడించిన నటి దివ్యవాణి

పంజాగుట్ట, వెలుగు: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఈ నెల 22న చెన్నైలో గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు గ్లోబల్ పీస్ ఫౌండేషన్ జాతీయ సభ్యురాలు, ప్రముఖ నటి దివ్యవాణి తెలిపారు. సమాజంలో శాంతి, సమానత్వం కాంక్షిస్తూ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫెస్టివల్​కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల నుంచి 10 వేల మంది ప్రముఖులు హాజరు కానున్నారని వెల్లడించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్​లో ఫెస్టివల్ వివరాలను ఆమె వెల్లడించారు.

ఈ సమావేశాలు రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నాయని, శాంతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సూచించారు. సమావేశంలో గ్లోబల్ పీస్ సభ్యులు వి. మెర్సీ బాణి, పద్మావతి, భవానీ, రేఖ రాణి తదితరులు పాల్గొన్నారు.