సంఘం విశ్వసనీయత పోగొట్టుకోవద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్

సంఘం విశ్వసనీయత పోగొట్టుకోవద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
  • 80 ఏండ్ల చరిత్ర టీఎన్జీవో సొంతం: మంత్రి పొన్నం ప్రభాకర్
  • ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలని వ్యాఖ్య

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ (టీఎన్జీవో)కు 80 ఏండ్ల చరిత్ర ఉందని.. ఆ సంఘం విశ్వసనీయతను పొగొట్టుకోవద్దని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం నాంపల్లిలోని టీఎన్జీవో హైదరాబాద్ భవన్ లో జిల్లా స్పోర్ట్స్ మీట్ బహుమతుల ప్రధానం కార్యక్రమానికి మంత్రి అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా స్పోర్ట్స్ లో విజేతలకు మంత్రి బహుమతులు అందజేశారు. ఉద్యోగుల సమస్యలు, హక్కులపై నిరంతర పోరాటాలు చేసిన, చేస్తున్న చరిత్ర టీఎన్జీవోకు ఉందని మంత్రి తెలిపారు.

తెలంగాణ ఏర్పాటులో , ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఉద్యోగ సంఘాలతో గత  10 ఏండ్లు నియంతృత్వంగా అప్పటి పాలకులు వ్యవహరించారని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ ప్రభుత్వ స్కీమ్ లను క్షేత్రస్థాయిలో చివరి లబ్ధిదారుడి వరకు అందించేందుకు ఉద్యోగులు కృషి చేయాలని మంత్రి సూచించారు.