ఫీజు బకాయిల  వివరాలివ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఫీజు బకాయిల  వివరాలివ్వండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌‌ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు బకాయిల వివరాలను సమర్పించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ కింద బకాయిలను చెల్లించకపోవడంతో కేశవ్‌‌‌‌‌ మెమోరియల్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ టెక్నాలజీతోపాటు ఇతర కాలేజీలు హైకోర్టులో పిటిషన్‌‌లు దాఖలు చేశాయి. వీటిపై జస్టిస్‌‌ వేణుగోపాల్‌‌ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదిస్తూ..ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌కు ప్రభుత్వం బడ్జెట్‌‌లో రూ.1500 కోట్లు కేటాయించినా, కాలేజీలకు విడుదల చేయలేదన్నారు.