'కొత్త లోక'తో నాగవంశీ ఒడ్డున పడ్డట్టేనా..? రియాల్టీ ఏంటంటే..

'కొత్త లోక'తో నాగవంశీ ఒడ్డున పడ్డట్టేనా..? రియాల్టీ ఏంటంటే..

కొన్ని నెలల ముందు వరకు టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్లలో ఒకడిగా ఉండేవాడు నాగవంశీ. కానీ ఇటీవల ఆయన జాతకం తిరగబడింది. 'మ్యాడ్ స్క్వేర్' సహా పలు సినిమాల నుంచి వచ్చిన లాభాలన్నింటినీ తన నిర్మాణంలో వచ్చిన 'కింగ్డమ్', అదే విధంగా తాను డిస్ట్రిబ్యూట్ చేసిన 'వార్ -2' చిత్రాలు మింగేశాయి. అంతే కాదు. అదనంగా నష్టాలు కూడా తెచ్చి పెట్టాయి. అదే సమయంలో ఆయన ప్రొడక్షన్ నుంచి రావాల్సిన 'మాస్ జాతర' వాయిదా పడటం మరో మైనస్ పాయింట్. ఇలా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న సమయంలో ఆయనకు ఊరట లభించింది.

'హలో' భామ కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో మలయాళంలో తెరకెక్కిన 'కొత్త లోక' సినిమాను తెలుగులో నాగవంశీ సంస్థ రిలీజ్ చేసింది. అయితే రిలీజ్ ముంగిట ఈ మూవీపై పెద్దగా అంచనాలు లేవు. కానీ మలయాళంలో బ్లాక్ బస్టర్ టాక్ తర్వాత తెలుగులోనూ రెండోరోజు నుంచి పుంజుకుంది. వీకెండ్లో ఇతర తెలుగు సినిమాలను మించి వసూళ్లు రాబట్టింది. దీంతో 'కింగ్డమ్', 'వార్-2' చేసిన గాయాల నుంచి ఈ మూవీ ఆయనకు కాస్త ఉపశమనం ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.