అమ్మ బాబోయ్ : 15 అడుగుల పాము.. అనకొండలా భయపెడుతుంది

అమ్మ బాబోయ్ : 15 అడుగుల పాము.. అనకొండలా భయపెడుతుంది

పాములంటే సాధారణంగానే అందరికి భయం. ఎందుకంటే వాటికి విషం ఉంటుంది కాబట్టి. కొన్ని సార్లు మనం మూడడుగుల పామును చూసిన భయంతో పక్కనుంచి వెళ్లిపోతాం. అదే ఒకే సారి15 అడుగుల పెద్ద పాము కంట పడితే మన రియాక్షన్ ఎలా ఉంటుంది. వెంటనే పరుగులు తీయడం మొదలు పెడతాం. 

15 అడుగుల పాము ఎక్కడైన ఉంటుందా అనే అనమానం వస్తుంది కదా..  కానీ నిజంగానే ఓ చోట 15 అడుగుల పొడవు గల పెద్ద పాము కనిపించింది. అలాంటి ఓ పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అది మరకెక్కడో కాదు మన దేశంలోనే ఉంది. అస్సాం రాష్ట్రంలోని ఓ నేషనల్ పార్క్ లో ఇంత పెద్ద పాము అక్కడి టూరిస్టుల కంట పడింది.  'జస్ట్ అస్సాం థింగ్స్' అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈ వీడియో షేర్ చేసింది. 

"కజిరంగా నేషనల్ పార్క్‌లోని బుర్హాపహర్ అటవీ ప్రాంతంలో 15 అడుగుల పొడవున్న కొండచిలువను పర్యాటకులు వీడియో తీశారు". అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటి వరకు ఒక లక్ష మంది వీక్షించారు. ఈ వీడియో చూసిన జనం షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఇంత పెద్ద పామును తామెప్పుడు చూడలేదని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఆశ్ఛర్యానికి గురై తమ రాష్ట్రంలో ఇంత పెద్ద పాను ఎప్పుడు చూడలేదని మరికొందరు అమ్మ బాబోయ్ అనకొండలా ఉందేంటని కామెంట్ చేస్తున్నారు.