- అఫ్గాన్‌తో ఉద్రిక్తతలే కారణం
ఇస్లామాబాద్: అఫ్గానిస్తాన్‌తో సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్‌లో కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయి. కిలో టమాటా ధర రూ. 600(పాకిస్తానీ రూపీ)కు చేరుకుంది. ఇతర కూరగాయల ధరలు కూడా 400% వరకు పెరిగాయి. పెరిగిన ధరలు పాక్‌లోని సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.
పాకిస్తాన్, -అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొనడంతో అక్టోబర్ 11 నుంచి బార్డర్ క్లోజ్ అయింది. దీంతో రెండు దేశాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతున్నది. ఇరుదేశాల్లో పండ్లు, కూరగాయలు, మెడిసిన్స్, గోధుమలు, బియ్యం, చక్కెర, మాంసం, పాల ఉత్పత్తులు వంటి నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి జనం తీవ్ర అవస్థలు పడుతున్నారు.
