మా తమ్ముడే.. అంత్యక్రియలకు డబ్బులు లేక ముక్కలుగా నరికాం..

మా తమ్ముడే.. అంత్యక్రియలకు డబ్బులు లేక ముక్కలుగా నరికాం..

మద్యానికి బానిసై చనిపోయిన సొంత సోదరుడి అంత్యక్రియలకు డబ్బుల్లేక ముక్కలు ముక్కలుగా చేసి గోనె సంచిలో పడేశారు అన్నా చెల్లెలు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. 2023, మే 11వ తేదీ అర్థరాత్రి సిటీలోని లంగర్ హౌజ్ ప్రాంతంలో ఆటో తరలిస్తున్న ప్లాస్టిక్ కవర్లను పరిశీలించిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. అంత్యక్రియలకు డబ్బులు లేకపోతే స్వచ్ఛంధ సంస్థలకు సమాచారం ఇవ్వొచ్చు.. పోలీసులకు చెప్పొచ్చు.. అలా కాకుండా సోదరుడి మృతదేహాన్ని ముక్కలుగా చేసి.. ఓ దర్గా దగ్గర మూటలను వదిలేసి వెళ్లటంపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వేళ అశోక్ సహజంగా చనిపోయినట్లు అయితే.. ఈ విషయాన్ని చుట్టుపక్కల వాళ్లకు కూడా తెలియకుండా.. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సొంత తమ్ముడు చనిపోతే.. అది కూడా అనారోగ్యంతో చనిపోయినట్లయితే.. ఎందుకు బంధువులకు సమాచారం ఇవ్వలేదు అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. 

అనారోగ్యంతో సహజంగా చనిపోయినట్లయితే.. శరీరాన్ని ముక్కలుగా నరికి.. గోనె సంచుల్లో పెట్టి ఎక్కడో డంప్ యార్డులోనే.. చెత్త కుప్పల్లో వేయాలి కానీ.. అలా కాకుండా ఓ దర్గా దగ్గర పడేయటం ఏంటనే ప్రశ్నలతోపాటు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం రాబట్టే పనిలో ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలోనే మృతుడి అక్కా, తమ్ముడిపై హత్య కేసు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు నమోదుపైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నిందితులు రాజు, స్వరూప. అనారోగ్యంతోనే చనిపోయాడని.. మేం చంపలేదని వాదిస్తున్నారు. 

గోనె సంచిలో కుక్కి..  ఆటోలో తీసుకొచ్చి 

ఆశోక్ శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి, గోనె సంచిలో కుక్కి  రాజు, స్వరూప ఆటోలో తీసుకొచ్చి లంగర్ హౌస్ లోని దర్గా దగ్గర పడేశారు.  దీనిని స్థానికులు గమనించి ఏమిటి అని అడిగారు. సమాధానం చెప్పకుండా ఆ ఇద్దరూ ఆటోలో అక్కడి నుంచి జారుకున్నారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి చూడగా గోనె సంచిలో డెడ్​బాడీ ఉన్నట్లు గుర్తించారు. ముక్కలు, ముక్కలుగా నరికి పాలిథిన్ కవర్​లో శరీర భాగాలను మూటగట్టినట్లు తెలిసింది. 

రంగంలోకి పోలీసులు  

స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఇద్దరిని  సీసీ కెమెరాల అధారంగా పట్టుకున్నారు. చనిపోయిన ఆశోక్ కు వీరు వరుసకు సొంత అన్నా చెల్లెలు అవుతారని పోలీసుల దర్యాప్తులో తేలింది.  అనారోగ్య కారణంగా అశోక్ మృతి చెందాడని పోలీసుల అదుపులో ఉన్న నిందితుల వివరణ ఇచ్చారు.  మృతుడు అశోక్ గతంలో డాన్ బాస్కో హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాడు. లాభం లేదని వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకెళ్లామని వైద్యులు చెప్పారని  నిందుతులు పోలీసుల విచారణలో వెల్లడించారు.  

అంత్యక్రియలకు డబ్బులు లేక

ఇంట్లో మృతి చెందిన ఆశోక్ అంత్యక్రియలకు డబ్బులు లేక అతని బాడీని  పారేయటానికి ముక్కలుగా నరికానని అతని సోదరుడు రాజు విచారణలో వెల్లడించాడు. అతనిపై పోలీసులు 302, 201 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆశోక్ నిజంగానే మద్యానికి బానిసై చనిపోయడా లేక అతని సోదరి, సోదరుడు ఆశోక్ ను చంపేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  ఆశోక్ డెడ్ బాడీని  పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.