Exit Polls: బీహార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. NDA కూటమిదే అధికారం అంటున్న సర్వేలు

Exit Polls: బీహార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయ్.. NDA కూటమిదే అధికారం అంటున్న సర్వేలు

పాట్నా: 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయ్. నవంబర్ 6న మొదటి దశలో 121 స్థానాలకు, నవంబర్ 11న రెండవ దశలో 122 స్థానాలకు పోలింగ్ జరిగింది. బిహార్లో అధికారం చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 122 స్థానాలు సాధించాలి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బిహార్లో ఎన్డీయే కూటమిదే అధికారం అని అంచనా వేశాయి.

దైనిక్ భాస్కర్ రిపోర్టర్స్ ఎగ్జిట్ పోల్.. NDA స్పష్టమైన మెజారిటీని గెలుచుకుంటుందని అంచనా వేసింది. NDA కూటమికి 145 నుంచి 160 స్థానాలు దక్కొచ్చని చెప్పుకొచ్చింది. మహా కూటమికి 73 నుంచి 91 సీట్లు దక్కే అవకాశం ఉందని తెలిపింది. ఇతరులకు 5 నుంచి 10 స్థానాలు దక్కొచ్చని వెల్లడించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న వెల్లడవుతాయి. ఎగ్జిట్ పోల్స్ కేవలం అంచనా మాత్రమే తప్ప ఫలితాలు అలానే ఉంటాయని కాదు. ఎగ్జిట్ పోల్స్ చాలా సందర్భాల్లో తలకిందులైన ఎన్నికలను మనం చాలానే చూశాం.

న్యూస్24-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్
: NDA కూటమికి 147 నుంచి 167 స్థానాలు
* మహాఘట్ బంధన్ కూటమి.. 70 నుంచి 90 స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా
* ప్రశాంత్ కిషోర్ స్థాపించిన జన్ సూరాజ్ పార్టీకి 0 నుంచి 2 స్థానాలు దక్కే ఛాన్స్
* AIMIM పార్టీకి 2 నుంచి 3 స్థానాల్లో విజయం
* ఇతరులు 2 నుంచి 5 స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చిన న్యూస్24-మ్యాట్రిజ్ ఎగ్జిట్ పోల్

ఎన్డీయే కూటమికి అనుకూలంగా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్
* బీహార్లోని 243 అసెంబ్లీ స్థానాల్లో NDA కూటమికి (బీజేపీ+ జేడీయూ) 133 నుంచి 159 స్థానాలు
* మహాఘట్ బంధన్ కూటమికి (కాంగ్రెస్+ఆర్జేడీ) 75 నుంచి 101 స్థానాలు వస్తాయని అంచనా
* ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీకి 5 స్థానాలు గెలవచ్చని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ వెల్లడి
* ఇతరులు 2 నుంచి 8 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని వెల్లడించిన పీపుల్స్ పల్స్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ట్రెండ్స్
* NDA కూటమి 145- నుంచి 160 సీట్లు గెలిచే అవకాశం ఉందని దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్
* మహా కూటమికి 73 నుంచి 91 స్థానాలు

పీపుల్స్ ఇన్ సైట్:

  • NDA కూటమిదే అధికారమంటున్న పీపుల్స్ ఇన్ సైట్ 
  • NDA : 133  నుంచి 148 సీట్లు
  • మహాఘట్ బంధన్: 87 నుంచి 102
  • JSP : 0 నుంచి 2
  • ఇతరులు : 3 నుంచి 6 
 

చాణక్య స్ట్రాటజీస్ ఎగ్జిట్ పోల్స్


బీహార్ లో ఎన్డీఏ కూటమికి అనుకూలంగా Chanakya Strategies ఎగ్జిట్ పోల్స్ :

  • NDA కూటమి: 130-138, 
  • మహాగట్బంధన్: 100-108, 
  • జన్ సురాజ్ :0, 
  • ఇతరులు: 3-5