తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

తండ్రి కాబోతున్న ‘బిగ్ బాస్’ సామ్రాట్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్‌ సామ్రాట్ తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతను సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. తన భార్య అంజనా కడుపుతో ఉన్న ఫొటోను పోస్ట్ చేస్తూ తన లిటిల్ వన్ కోసం ఎదురుచూస్తున్నామని తెలిపాడు. దీనితో బిగ్ బాస్ కంటెస్టెంట్‌ లతో పాటుగా నెటిజన్లు వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సామ్రాట్ కర్ణాటకకు చెందిన అంజనా శ్రీలిఖితను 2020లో రెండో పెళ్లి చేసుకున్నాడు. అంతకుముందు హర్షితతో సామ్రాట్ కు వివాహం జరగగా, ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. కాగా బిగ్ బాస్ సీజన్ 2 లో సామ్రాట్ 5వ స్థానంలో నిలిచాడు. బిగ్ బాస్ తర్వాత సామ్రాట్ పెద్దగా బయట కనిపించలేదు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samrat Reddy (@samratreddy)