తెలుగులో అత్యంత ప్రజాదరణ పొందిన ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్ బాస్’ (Bigg Boss). ఇప్పటికే తొమ్మిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో.. త్వరలో పదో సీజన్తో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ సందర్భంగా ఇవాళ జూన్7న ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు బిగ్ బాస్ మేకర్స్.
హోస్ట్ నాగార్జున షో వివరాలు వెల్లడిస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేశారు. ‘బిగ్‌బాస్.. ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు. ఎన్నో హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం. ఈ సారి మీరు చూడబోయేది బిగ్‌బాస్ దశావతారం’ అని చెప్పారు. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో వైరల్ అవుతూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో చాలా రోజులుగా వెయిటింగ్.. అంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
సీజన్ 9 సక్సెస్.. పెరిగిన డిమాండ్!
గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. కంటెస్టెంట్ల ఎంపిక నుంచి టాస్కుల వరకు అన్నీ కొత్తగా ఉండటంతో ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఈ సక్సెస్‌తో నాగార్జున ఇమేజ్ మరింత పెరిగింది. ఫలితంగా పదో సీజన్ కోసం నాగార్జున తన పారితోషికాన్ని భారీగా పెంచినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఈ ఒక్క సీజన్ కోసం ఆయన ఏకంగా రూ.35 కోట్లకి పైగా డిమాండ్ చేసినట్లు ఫిలిం నగర్ సమాచారం. ఇదే నిజమైతే, తెలుగు బుల్లితెర చరిత్రలో ఒక హోస్ట్ అందుకునే అత్యధిక పారితోషికం ఇదే అవుతుంది.
