పాముకు రాఖీ కడుతుంటే కాటేసింది

పాముకు రాఖీ కడుతుంటే కాటేసింది

బీహార్‌‌‌‌‌‌‌‌: అతనో సాధారణ యువ రైతు. పాములంటే అభిమానం. ఇప్పటి వరకు ఎన్నో వందల పాములను పట్టాడు. ప్రేమతో రెండు పాములను ఇంట్లో పెంచుకుంటున్నAడు. ఆదివారం రాఖీ పండుగ నాడు తనతో పాటు పాములకూ రాఖీ కట్టాలని చెల్లెలిని కోరిండు.రెండు పాములను చేతిలో పట్టుకున్నాడు.. అతని చెల్లెలు ఒక పాముకు రాఖీ కడుతుండగా.. రెండో పాము అతని కాలుపై కాటు వేసింది. దీంతో  ఆ యువ రైతు ప్రాణం పోయింది. ఈ విషాదకర ఘటన బిహార్​లోని సారణ్​ జిల్లాలో జరిగింది. జిల్లాలోని శీతల్‌‌‌‌పూర్ గ్రామానికి చెందిన మన్మోహన్(24) పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పాములంటే మనోడికి ఎంతో ఇష్టం. గ్రామంలో ఎక్కడ పాములు కనిపించినా పట్టుకుని మచ్చిక చేసుకుంటాడు. ఇంట్లో రెండు పాములను పెంచుకుంటున్నాడు. ఆదివారం రాఖీ పండగ కావడంతో మన్మోహన్ చెల్లి అతడికి రాఖీ కట్టింది. అయితే, తనతో పాటు తమ్ముడు లాంటి పాముకు కూడా రాఖీ కట్టాలని చెల్లితో చెప్పాడు. అన్న విజ్ఞప్తి మేరకు పాముకు ఆమె రాఖీ కడుతుండగా అదే సమయంలో చేతిలో ఉన్న మరో పాము మన్మోహన్ కాలుపై కాటువేసింది. నిమిషాల్లోనే మన్మోహన్ పరిస్థితి విషమించింది. అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.