బీటెక్ చాయ్ వాలీ.. టీ స్టార్టప్‌ను ప్రారంభించిన స్టూడెంట్

బీటెక్ చాయ్ వాలీ.. టీ స్టార్టప్‌ను ప్రారంభించిన స్టూడెంట్

బీహార్‌కు చెందిన ఓ బీటెక్ విద్యార్థిని తన కలను సాకారం చేసుకునేందుకు హర్యానాలోని ఫరీదాబాద్‌లో టీ స్టాల్‌ను ఏర్పాటు చేసింది. వర్తికా సింగ్ అనే ఈ విద్యార్థి ఎప్పటికైనా సొంతంగా వ్యాపారాన్ని పెట్టాలని ఆశించింది. ప్రస్తుతం ఆమె ఇంజినీరింగ్ చదువుతోంది. తాను వ్యాపారం ప్రారంభించడానికి తన చదువును అడ్డుగా చూడదలుచుకోలేదు. దీంతో బి. టెక్ చాయ్ వాలీ పేరుతో టీ స్టాల్‌ను ప్రారంభించింది.

ఫరీదాబాద్‌లోని గ్రీన్ ఫీల్డ్ సమీపంలో తాను టీ స్టాల్‌ను ప్రారంభించానని, ఇది సాయంత్రం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు తన స్టాల్‌ను తెరిచి ఉంచుతానని వర్తిక ఓ వీడియోలో తెలిపింది. వర్తిక మసాలా, లెమన్ చాయ్‌ వంటి వివిధ రకాల టీలను కస్టమర్లకు అందిస్తోంది.- వీటి ధర ఒక్కొక్కటి ₹ 20 కి, సాధారణ చాయ్‌ని ₹ 10కి విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఆమె ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. దీన్ని స్వాగ్ సే డాక్టర్ పేరుతో ఉన్న అడ్మిమ్ ఈ వీడియోను షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.