గచ్చిబౌలిలో డివైడర్ను ఢీకొట్టిన బైక్..ఇద్దరు స్టూడెంట్స్ మృతి

గచ్చిబౌలిలో డివైడర్ను ఢీకొట్టిన బైక్..ఇద్దరు స్టూడెంట్స్ మృతి

హైదరాబాద్: గచ్చిబౌలిలో రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం (మే 31) సాయంత్రం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో అదుపుతప్పి బైక్ డివైడర్ ను ఢీకొట్టడంతో.. బైక్ వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. చనిపోయిన వారు స్టూడెంట్స్ నవీన్ రెడ్డి(22), హరీష్ చౌదరి(22)  పోలీసులు గుర్తించారు.

గౌలిదొడ్డి నుంచి  గచ్చిబౌలి వైపు వెళ్తుండగా విప్రో సర్కిల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.తీవ్రగాయాలైన వారిని సమీప ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.