
హైదరాబాద్ మంగాపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ లో అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా స్థానిక దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దామోదర్ గోస్వామి మహరాజ్ జీ, మహాప్రసాదం వంటి కార్యక్రమాల ద్వారా శ్రీ రామ్‌జీ ప్రాణప్రతిష్టను ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థాన ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు. సుమారు వెయ్యి మంది రామభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ ప్రెసిడెంట్ వెంకట్, సెక్రటరీ యశ్వంత్ కార్యక్రమానికి మద్దతిచ్చి కాలనీ వాసులందరినీ అభినందించారు.