బీభత్సంగా తిన్నారు : రంజాన్ నెలలో 60 లక్షల బిర్యానీలు.. 6 లక్షల హలీంలు..

బీభత్సంగా తిన్నారు : రంజాన్ నెలలో 60 లక్షల బిర్యానీలు.. 6 లక్షల హలీంలు..

రంజాన్ నెల ముగిసింది.. ముస్లింల పవిత్రమైన రంజాన్ మాసం.. ముస్లింలు ఎలా తిన్నారో ఏమో.. హైదరాబాదీలు మాత్రం కులం, మతం, ప్రాంతం చూడకుండా రంజాన్ నెలలో బిర్యానీలు తెగ తినేశారు.. అంతేనా హలీంలు అయితే లాగించేశారు.. 

ఆన్ లైన్ ఆర్డర్ డెలివరీ యాప్స్ లో ఒకటి అయిన స్విగ్గీలోనే.. హైదరాబాద్ లో.. ఒక్క రంజాన్ నెలలోనే 60 లక్షల బిర్యానీ ఆర్డర్స్ డెలివరీ అయ్యాయి.. ఇక 5 లక్షల 60 వేల హలీంలు డెలివరీ అయ్యాయి. రెగ్యులర్ నెలలతోపాల్చితే ఇది 15 శాతం అధికం.. ఒక్క స్విగ్గీలోనే 60 లక్షల బిర్యానీలు.. 6 లక్షల హలీంలు అంటే.. ఇక జుమాటో, ఇతర డెలివరీ యాప్స్ లో ఇంకెన్ని బిర్యానీలు, హలీంలు ఆర్డర్ చేశారో కదా..

రంజాన్ పండుగను పురస్కరించుకుని స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్లు పెరిగిపోయాయి. ఈ రంజాన్‌ మాసంలో స్విగ్గీ 60 లక్షల బిర్యానీ ఆర్డర్స్ నమోదైనాయి. హైదరాబాద్‌లో 60 లక్షల బిర్యానీ ఆర్డర్లు, 5.60  లక్షల హలీమ్‌ ఆర్డర్లు వచ్చినట్లు తెలిపింది.హలీమ్-మానియా హైదరాబాద్‌ను పట్టుకుంది. హైదరాబాద్ ఈ రంజాన్‌ మాసంలో స్విగ్గీలో 5 లక్షల 60 వేలహలీమ్‌లను ఆర్డర్ పొందింది.  స్విగ్గీ విడుదల చేసిన రంజాన్ ఆర్డర్ విశ్లేషణ నివేదిక ప్రకారం....  రంజాన్ సందర్భంగా నగరంలో ఆహారం కోసం చాలామంది ఆర్డర్ చేశారు. హలీమ్, చికెన్ బిర్యానీ, సమోసాలు వంటి సంప్రదాయ ఇష్టమైనవి రంజాన్ సమయంలో అత్యంత ప్రజాదరణ పొందిన వంటకాలుగా ఉన్నాయని ఆర్డర్ విశ్లేషణ వెల్లడించింది.సాధారణ రోజుల కంటే ఇవి 15 శాతం ఎక్కువ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది.

రంజాన్‌ మాసం సందర్భంగా సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల వరకు ఇఫ్తార్‌ ఆర్డర్లు 34 శాతం పెరిగాయని తెలిపింది. ఆర్డర్లలో ఎక్కువగా చికెన్‌, మటన్‌ బిర్యానీ, హలీమ్‌, సమోసా, ఫలుదా, ఖీర్‌ ఉన్నాయని స్విగ్గీ తెలిపింది. జాతీయ స్థాయిలో చూస్తే హలీమ్‌ ఆర్డర్లు 1454.88 శాతం, ఫిర్స్‌ 80.97 శాతం పెరిగినట్లు తెలిపింది. మాల్పువా ఆర్డర్లు 79.09 శాతం, ఫలుదా 57,93 శాతం, డేట్స్‌ 48.40 శాతం ఆర్డర్లు పెరిగినట్లు తెలిపింది.   హలీమ్, రంజాన్ ప్రత్యేక వంటకం, చికెన్, పాలమూరు పొటెల్, పర్షియన్ స్పెషల్ హలీమ్, డ్రై ఫ్రూట్ హలీమ్‌తో సహా తొమ్మిది రకాలకు భారీగా ఆర్డర్‌లు వచ్చాయి. మటన్ హలీమ్ నగరం ఇష్టమైన వంటకం. 
 
క్రిస్పీ, పైపింగ్ హాట్ సమోసాలు, భాజియాలు ఇఫ్తార్ లేదా ఉపవాసం విరమణకు ఇష్టమైనవి. అత్యంత ప్రజాదరణ పొందిన ఇఫ్తార్ ఐటమ్స్‌లో ఖర్జూరంతో చేసిన వంటకాలతో పాటు సమోసాలు, భాజియా ఉన్నాయి. భాజియాలకు ఆర్డర్లలో గతేడాదితో పోలిస్తే  77 శాతం పెరుగుదల ఉంది.  స్వీట్‌ల విషయానికి వస్తే, హైదరాబాద్‌లో మాల్పువా , ఖర్జూరం మరియు  ఫిర్నీ వంటి తీపి వంటకాలకు ఆర్డర్లు బాగా పెరిగాయి . ముంబై, కోల్‌కతా, లక్నో, భోపాల్, మీరట్‌లో  కూడాఆర్డర్లు పెరిగాయని స్విగ్గీ సంస్థ తెలిపింది.  మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు  స్విగ్గీపై చేసిన ఆర్డర్‌ల విశ్లేషణ ఆధారంగా ఈ ఫలితాలు వెల్లడయ్యాయి.