2009లో రూ.2 ఇన్వెస్ట్ చేసినోళ్లు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు.. ఎందులో అంటే?

2009లో రూ.2 ఇన్వెస్ట్ చేసినోళ్లు ఇప్పుడు కోటీశ్వరులయ్యారు.. ఎందులో అంటే?

Investment: అదృష్టం ఎవరి తలుపూ ఊరినే తట్టడు. దానికి చాలా ఓపిక అవసరం. పెట్టుబడుల విషయంలో కూడా ఇదే ఫార్ములా పనిచేస్తుంది. చాలా మంది దిగ్గజ ఇన్వెస్టర్లు ఎప్పుడూ చెబుతుండేది కూడా ఇదే క్రమశిక్షణగా పెట్టుబడి పెట్టడంతో పాటు ఓపికగా ఎదురుచూసే వారినే లాభాలు వరిస్తాయి. అందుకే ఎల్లప్పుడూ దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు ఊహించిన లాభాలను అందుకుంటుంటారు. 

ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బిట్‌కాయిన్ గురించే. అమెరికాలో 2008 రియల్ ఎస్టేట్ బబుల్ క్రాష్ ప్రపంచాన్ని ఆర్థికంగా అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక మాద్యం భారత వ్యాపార సంస్థలను కూడా ప్రభావితం చేసింది. ఈ సమయంలోనే మార్కెట్లలోని చాలా మంది ఇన్వెస్టర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నారు. కానీ ఆ తర్వాత కొత్తగా ప్రపంచంలోకి వచ్చిన పెట్టుబడి సాధనమే క్రిప్టో కరెన్సీ. క్రిప్టో అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బిట్‌కాయిన్. దానికి ఉన్న చరిత్ర క్రేజ్ అలాంటిది. 

ఎవరైనా భారతీయ ఇన్వెస్టర్లు 15 ఏళ్ల కిందట 2009లో బిట్‌కాయిన్ ధర 0.04865 డాలర్ల వద్ద ఉన్నప్పుడు భారత కరెన్సీ ప్రకారం ఒక్కోటి రూ.2.25 సమయంలో పెట్టుబడి పెట్టి ఒక్క బిట్ కాయిన్ కొని దానిని ఇప్పటి వరకు హోల్డ్ చేసి ఉంటే దాని విలువ ప్రస్తుతం కోటి రూపాయల కంటే ఎక్కువగా ఉండేది. అప్పట్లో డాలర్ రూపాయి మారకపు విలువ రూ.46 వద్ద ఉన్న సంగతి తెలిసిందే. బిట్‌కాయిన్ ఈ కాలంలో ఏకంగా 44 లక్షల రెట్ల కంటే ఎక్కువ రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టడం గమనార్హం. 

శుక్రవారం బిట్‌కాయిన్ ధర లక్ష 16వేల 906 డాలర్ల వద్ద ఉంది. భారత కరెన్సీ లెక్కల ప్రకారం ఒక్కో కాయిన్ విలువ ప్రస్తుతం రూ.కోటి కంటే ఎక్కువే. అయితే ప్రస్తుతం టెక్నికల్ కారణాలతో పాటు ఫండమెంటల్స్ కూడా బిట్‌కాయిన్ ర్యాలీకి దోహదపడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే అమెరికాలో క్రిప్టో ఈటీఎఫ్స్ రాక, ప్రపంచ వ్యాప్తంగా రెగ్యులేటరీ అడ్డంకులు తొలగింపు వంటి కారణాలు ప్రస్తుతం క్రిప్టోలను ఆకర్షనీయంగా మారుస్తున్నాయని బైయూకాయిన్ సీఈవో శివమ్ థక్రాల్ చెప్పారు. మరికొందరు ప్రస్తుతం క్రిప్టోలు బుల్ సైకిల్ లోకి ఎంటర్ అవుతోందని అంచనాలను పంచుకుంటున్నారు. 

ప్రస్తుతం బిట్‌కాయిన్ మెుత్తం మార్కెట్ విలువ 2.23 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ క్రమంలో డోజీకాయిన్ కూడా మంచి ర్యాలీని చూస్తోంది. క్రిప్టోలను ప్రజలు కొత్తరకం డిజిటల్ ఆస్తులుగా పరిగణించటం, అంగీకరించటం ప్రారంభించటమే వీటి ధరల ర్యాలీకి కారణంగా నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ బ్లాక్‍‌రాక్ 65 బిలియన్ డాలర్లు విలువైన బిట్‌కాయిన్లను హోల్డ్ చేస్తోంది. దీనికి తోడు ట్రంప్ క్రిప్టోలకు ఎన్నికల ముందు నుంచే అనుకూలంగా ఉండటం.. ఆయన ఫ్యామిలీ కూడా క్రిప్టో పరిశ్రమలో వ్యాపారం చేస్తుండటం కూడా గ్లోబల్ ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేస్తోంది.