
హైదరాబాద్, వెలుగు: ప్రపంచంలోనే అతి గొప్ప ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ఫోజులు కొట్టారని బీజేపీ ఆరోపించింది. విదేశీ యాత్రలకు కొన్ని వందల కోట్లు తగలేసిన కేటీఆర్ చేసిందల్లా ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేయడమేనని ఆదివారం ఓ ట్వీట్ లో మండిపడింది. ‘‘బీఆర్ఎస్ పాలించిన పదేండ్లలో ఒక్క స్టార్టప్ ను కూడా స్థాపించిన దాఖలాలు లేవని తెలంగాణ ఐటీ బ్యూరోక్రటిక్ హెడ్జయేశ్ రంజన్అంటున్నారు. టీహబ్, వీహబ్ లాంటివి స్థాపించామని డాబులు పోయిన అప్పటి ఐటీ శాఖ మంత్రి.. అవన్నీ తన సొంత ప్రయోజనాలు, పబ్లిసిటీ కోసం చేసినవేనని చెప్తున్నారు. ఆ సంస్థల వల్ల ప్రయోజనం పొందిన వాళ్లు ఎవరూ లేరని జయేశ్ రంజన్ వాపోయారు’’ అని బీజేపీ ట్వీట్లో పేర్కొంది..