త్వరలో మరో నలుగురిని అరెస్ట్ చేస్తారు : ఢిల్లీ మంత్రి అతిషి

త్వరలో మరో నలుగురిని అరెస్ట్ చేస్తారు : ఢిల్లీ మంత్రి అతిషి

ఢిల్లీ మంత్రి అతిషీ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరాలని సన్నిహితుల ద్వారా బీజేపీ తనను సంప్రదించిందన్నారు. దానికి తాను నిరాకరించానని చెప్పారు.  బీజేపీలో చేరకపోతే  మరో  నెలలో తనను  ఈడీ అరెస్టు చేస్తుందని చెప్పారు.

సీఎం కేజ్రీవాల్ జైలులో ఉన్నప్పటికీ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికీ యూనిటీగా, బలంగా ఉందన్నారు. అయితే బీజేపీ నేతలు ఆమ్ ఆద్మీ పార్టీ   తదుపరి నాయకత్వాన్ని జైలులో పెట్టాలని యోచిస్తున్నారని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికల లోపు   మరో 4 మంది AAP నాయకులను అరెస్టు చేస్తారని తెలిపారు.  - సౌరభ్ భరద్వాజ్, అతిషి, దుర్గేష్ పాఠక్,  రాఘవ్ చద్దాలను ఈడీ అరెస్ట్ చేస్తుందని ఆరోపించారు.