ఫిబ్రవరి 25 నుంచి బీజేపీ ప్రచారం

ఫిబ్రవరి 25 నుంచి బీజేపీ ప్రచారం

ఎమ్మెల్సీ ఎన్నికలకు 1530 పోలింగ్​ కేంద్రాలు

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్​ కేంద్రాల ఏర్పాటుపై స్పష్టత వచ్చింది. రెండు గ్రాడ్యుయేట్​ నియోజకవర్గాలకు కలిపి 1,530 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సీఈవో కార్యాలయం నిర్ణయించింది. మహబూ బ్​నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సెగ్మెంట్​కు 799.. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి 731 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఏర్పాటు చేసిన వాటికంటే 368 ​కేంద్రాలు ఈసారి పెరిగాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు గ్రాడ్యుయేట్‌​పోలింగ్​ పర్సెంటేజీ పెంచడంలో భాగంగానే పోలింగ్ స్టేషన్లు పెంచినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లకు 16 కిలో మీటర్ల లోపే పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు. కొన్నింటి ప్లేస్​ను మార్చామని, ఆ వివరాలు సంబంధిత జిల్లాల ఆఫీసర్లు.. ఓటర్లకు తెలిసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

27 నామినేషన్లు

రాష్ట్రంలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు శనివారం 27 నామినేషన్లు ఫైల్ అయినట్లు చీఫ్‌‌ ఎలక్టోరల్‌‌ ఆఫీసర్‌‌ శశాంక్‌‌ గోయల్‌‌ తెలిపారు. హైదరాబాద్‌‌–రంగారెడ్డి–మహబూబ్‌‌నగర్‌‌ సీటుకు 18, వరంగల్‌‌–-ఖమ్మం-–నల్గొండ స్థానానికి 9 నామినేషన్లు దాఖలైనట్లు చెప్పారు. హైదరాబాద్‌‌–రంగారెడ్డి–- మహబూబ్‌‌నగర్‌‌ స్థానానికి మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌‌ నాగేశ్వర్‌‌, కాంగ్రెస్‌‌ అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌‌ రెడ్డి, ప్రైవేట్‌‌ జూనియర్‌‌ కాలేజీల సంఘం ప్రెసిడెంట్‌‌ గౌరీ సతీశ్ ఇండిపెండెంట్ క్యాండిడేట్లుగా నామినేషన్ వేశారు. నాగేశ్వర్ ఎల్బీ స్టేడియం నుంచి జీహెచ్ఎంసీ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లి, నామినేషన్ వేశారు. తనకు ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయని ఆయన తెలిపారు.

ఈ నెల 25 నుంచి బీజేపీ ప్రచారం స్టార్ట్‌

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 25 నుంచి స్టార్ట్‌‌ చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. మార్చి 10 వరకు ప్రచారం చేయాలని రాష్ట్ర నేతలు నిర్ణయించినట్టు సమా చారం. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అనే నినాదంతో ఓటర్ల ముందుకు వెళ్లాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. టీఆర్‌‌‌‌ఎస్‌‌ సర్కారు చేస్తున్న అరాచకాలు, అవినీతి పాలనతో పాటు, దేశంలో మోడీ సంక్షేమ పథకాలు, అవినీతి లేని పాలన గురించి ప్రధానంగా ప్రచారం చేయడానికి నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లోని సిటీల్లో సభలు నిర్వహించాలని, గ్రాడ్యుయేట్లు, ఎంప్లాయీస్‌‌, టీచర్లు, నిరుద్యోగులు, పెన్షనర్లను సభకు రప్పించాలనే ప్లాన్‌‌లో బీజేపీ నేతలు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌‌ను రాష్ట్ర నాయకత్వం త్వరలోనే ప్రకటించనుంది. ప్రచారంలో బీజేపీ స్టేట్‌‌ చీఫ్‌‌ బండి సంజయ్‌‌తో పాటు పలువురు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. సిట్టింగ్‌‌ సీటైన హైదరాబాద్‌‌తో పాటు వరంగల్‌‌లో కూడా విజయం సాధించాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.

For More News..

4 నెలల్లో రాష్ట్రాలకు రూ. లక్ష కోట్లు