లెక్కింపు రోజే.. బీజేపీ క్యాండిడేట్ మృతి

లెక్కింపు రోజే.. బీజేపీ క్యాండిడేట్ మృతి

లక్సెట్టిపేట వెలుగు: కౌన్సిలర్​ ఎన్నికల్లో పోటీ చేసిన ఓ అభ్యర్థి కౌంటింగ్​ రోజు అనారోగ్యంతో మృతిచెందారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మున్సిపల్ ఎన్నికల్లో పదో వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బత్తిని ఎల్లమ్మ(65) పోటీ చేశారు. 

ఈ నెల 8న ఆమె అనారోగ్యానికి గురికాగా మంచిర్యాల దవాఖానలో చికిత్స చేయిస్తున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం చనిపోయింది. ఎన్నికల్లో ఆమెకు 169 ఓట్లు పోలయ్యాయి. విజయం సాధించిన అభ్యర్థికి 217 ఓట్లు పడ్డాయి.