జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ పర్యవేక్షణ కమిటీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ పర్యవేక్షణ కమిటీ
  • నేడు కార్యకర్తల సమావేశం 

హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను పర్యవేక్షించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో బీజేపీ శాసన సభాపక్ష ఉప నాయకుడు పాయల్ శంకర్, మెదక్ ఎంపీ ఎం.రఘునందన్ రావు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా మాజీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్. గౌతమ్ రావు ఉన్నారు. 

కాగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ పోలింగ్ బూత్ కమిటీ, ఆపై స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశం శనివారం యూసుఫ్ గూడలో జరగనున్నది. దీనికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు అటెండ్ కానున్నారు.