ప్రభుత్వం మా సమయాన్ని వృథా చేసింది.. నడ్డాతో చర్చలపై దీప్కే విమర్శ

 ప్రభుత్వం మా సమయాన్ని వృథా చేసింది.. నడ్డాతో చర్చలపై దీప్కే విమర్శ

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై పోలీసుల అణచివేత కొనసాగిస్తూనే.. మరో వైపు సీజేపీతో సంప్రదింపులు జరిపిందని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే  విమర్శించారు. మంగళవారం జంతర్ మంతర్ ఆయన మాట్లాడారు. ‘వారు మా ప్రతినిధి బృందాన్ని పిలిచారు. వారి మొబైల్స్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకున్నారు. అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌‌‌‌‌‌‌‌ ఒకరకంగా జేపీ నడ్డా నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు. ప్రభుత్వం మా టైం వేస్ట్​ చేసింది’ అని దీప్కే అన్నారు. ‘మా బృందాన్ని చెల్లాచెదురు చేయడమే వారి మొత్తం ప్రణాళిక. ఒకవైపు చర్చలకు పిలిచి, మరోవైపు విద్యార్థులపై లాఠీలు ఝుళిపిస్తున్నారు’ అని ఆయన ఆరోపించారు.