గాంధీనగర్: ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీజేపీ చాలా నయమని గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ అన్నారు. గుజరాత్‌లో 1975 నుంచి 1995 వరకు కాంగ్రెస్ పాలనలో ఉందని.. అప్పటి దశతో పోల్చుకుంటే 2001 నుంచి 2020 వరకు బీజేపీ అధికారంలో ఎన్నో ఉద్యోగాలను కల్పించామన్నారు. గుజరాత్ అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న నితిన్ పైవ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో ఉన్న 20 ఏళ్లలో 80,193 ఉద్యోగాలను ఇచ్చింది. కానీ గత ఇరవై ఏళ్ల పాలనలో బీజేపీ సర్కార్ 2,63,591 జాబ్స్‌ను కల్పించింది. ఈ లెక్కల్ని బట్టి కాంగ్రెస్‌కు బీజేపీ ప్రభుత్వాలకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకోవచ్చు. దీనిపై ఇంకా స్పష్టత ఇవ్వాల్సిన అవసరం లేదనుకుంటా’ అని నితిన్ పటేల్ చెప్పారు.

