పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఏప్రిల్ 2న బిజెపి సమరభేరి జరగబోతోంది. ఈ సమరభేరికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి హాజరుకానున్నారు. సమరభేరిలో మాజీ ఎమ్మెల్యే చంద్రుపట్ల రాంరెడ్డి, ఆయన తనయుడు చంద్రుపట్ల సునీల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. రెండు నెలల క్రితం వీళ్లు టీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేసిందని.. సీఎం కేసీఆర్ ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు సునీల్ రెడ్డి.
