Theatre Movies: ఏప్రిల్ 17 గుర్తుంచుకోండి.. థియేటర్లలోకి కొత్త సినిమాలు.. తెలుగు లిస్టు బిగ్ బ్లాస్టే

Theatre Movies: ఏప్రిల్ 17 గుర్తుంచుకోండి.. థియేటర్లలోకి కొత్త సినిమాలు.. తెలుగు లిస్టు బిగ్ బ్లాస్టే

ఈ వీకెండ్ (ఏప్రిల్ 17, 2026న) థియేటర్లలోకి అదిరిపోయే సినిమాలు వస్తున్నాయి. ఫ్యామిలీ, రొమాంటిక్, పీరియాడికల్‌ యాక్షన్, క్రైమ్, రూరల్ డ్రామా వంటి విభిన్న జోనర్లలో వస్తూ ఆడియన్స్ను అలరించనున్నాయి. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునే విలేజ్ డ్రామా, రొమాంటిక్ యాక్షన్ సినిమాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా, ఈ సినిమాలన్నీ ఆసక్తికరమైన కథాంశాలతో వస్తుండటం విశేషతను సంతరించుకున్నాయి. మరి సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.. 

‘తిమ్మరాజుపల్లి టీవీ’:

హీరో కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్న చిత్రం ‘తిమ్మరాజుపల్లి టీవీ’. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ పీరియాడిక్ డ్రామా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్‌‌ను ఇందులో చూపించనున్నారు.

ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. అనంతరం, మేకర్స్ సైతం ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో అంచనాలు పెంచేసారు. వి. మునిరాజు డైరెక్ట్ చేయగా, కొత్తవాళ్లు సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్నారు. 

‘పాపం ప్రతాప్‌‌’:

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమాతో హిట్ అందుకున్న తిరువీర్.. వరుస ఎక్సైటింగ్‌‌ ప్రాజెక్ట్స్‌‌తో బిజీగా ఉన్నాడు. ఈ వారం తిరువీర్ నుంచి ఇంట్రెస్టింగ్ మూవీ థియేటర్లోకి రానుంది. అదే ‘పాపం ప్రతాప్‌‌’. శుక్రవారం ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది.

పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌‌గా నటించిన ఈ చిత్రానికి ఎస్పీ దుర్గా నరేష్‌‌ దర్శకత్వం వహించాడు. KM రాధా కృష్ణ ఈ , సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. ఈ మూవీ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా రానుంది. టీజర్, ట్రైలర్లో కామెడీ, హీరో హీరోయిన్ల మధ్య రొమాన్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

‘బ్యాడ్ బాయ్ కార్తీక్‌‌‌‌‌‌‌‌’:

నాగశౌర్య హీరోగా నటించిన యాక్షన్‌‌‌‌‌‌‌‌ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్ ‘బ్యాడ్ బాయ్ కార్తీక్‌‌‌‌‌‌‌‌’. రామ్ దేశినా (రమేష్‌‌‌‌‌‌‌‌) డైరెక్ట్ చేశాడు. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా థియేట్రికల్, నాన్-థియేట్రికల్ హక్కులను ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ (Zee Studios) సొంతం చేసుకోవడంతో మంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. 

‘తెరచాప’:

నవీన్ రాజ్ సంకరపు, పూజా సుహాసిని లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో జోయల్‌‌‌‌‌‌‌‌ జార్జ్‌‌‌‌‌‌‌‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘తెరచాప’. ఏప్రిల్ 17న సినిమా విడుదల కానుంది.ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కు ఆడియన్స్‌ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి, ఫిష్ వెంకట్, జబర్దస్త్ అశోక్ కీలకపాత్రలు పోషించారు. 

‘పళ్లిచట్టంబి’:

మలయాళ స్టార్  టొవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పళ్లిచట్టంబి’. డిజో జోస్ ఆంటోనీ దర్శకత్వంలో నౌఫల్, బ్రిజీష్, చాణుక్య చైతన్య చరణ్ నిర్మించారు. ఏప్రిల్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో థియేట్రికల్ రిలీజ్‌‌కు రాబోతోంది.

1950–60 పీరియాడికల్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో సాగే కథగా తెరకెక్కింది. కయదు లోహర్ హీరోయిన్‌‌. మలయాళ డబ్బింగ్ మూవీస్ అయిన ‘మిన్నల్‌ మురళి’, 2018, అన్వేషిప్పిన్ కండేతుమ్, ఆర్మ్ వంటి సినిమాలతో మెప్పించిన థొవినో.. పళ్లి చట్టంబితో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి. 

‘భూత్ బంగ్లా’:

డైరెక్టర్ ప్రియదర్శన్ డైరెక్ట్ చేసిన కొత్త మూవీ ‘భూత్ బంగ్లా’. అక్షయ్ కుమార్ తో కలిసి 14 ఏళ్ల తర్వాత రూపొందించిన ఈ హారర్-కామెడీ ఏప్రిల్ 17న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో టబు, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ మరియు వామికా గబ్బి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇది ఒక పాత బంగ్లా నేపథ్యంలో సాగే భయానకమైన మరియు హాస్యాస్పదమైన కథ.