Yuzvendra Chahal: టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ మరోసారి వార్తల్లో నిలిచారు. స్టేడియంలో వికెట్లతో మ్యాజిక్ చేసే యూజీ.. ఈసారి సోషల్ మీడియాలో ఓ హాట్ బ్యూటీతో జరిపిన చాటింగ్ కారణంగా చిక్కుల్లో పడ్డారు. గాంధీ బాత్ ఫేమ్ యాక్టర్ తాన్యా ఛటర్జీ తాజాగా చేసిన ఆరోపణలు ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇటీవలే ఒక పాపరాజీ ఇంటర్వ్యూలో మాట్లాడిన తాన్యా ఛటర్జీ, చాహల్ తనకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్‌లు పంపినట్లు పేర్కొనింది. చాహల్ తన సొంత వీడియోలను ఆమెకు డైరెక్టుగా మెసేజ్ చేయడమే కాకుండా తనను క్యూట్ అని పిలిచినట్లు ఆమె తెలియజేసింది. అతను నాకు వ్యక్తిగతంగా అసలు తెలియదు, అలాంటి వ్యక్తి నుంచి ఇలాంటి మెసేజ్‌లు రావడం నాకు షాక్ గా అనిపించిందంటూ తన ఫోన్‌లోని చాట్‌ను కెమెరాకు చూపించింది.
తాన్యా ఛటర్జీ చూపించిన వీడియోలో చాహల్ తన పాత వీడియోలను కొన్నింటిని ఆమెకు పంపినట్లు కనిపిస్తుంది. ఆమె కావాలనే పబ్లిసిటీ కోసం ఈ విషయాన్ని బహిర్గతం చేసినట్లు తెలుస్తుంది. మరోవైపు చాహల్ నిజంగానే పరిధులు దాటారా అన్నది ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వీడియో బయటకు వచ్చిన వెంటనే సోషల్ మీడియాలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్.. చాహల్ ఒక వీడియో పంపితే దాన్ని ఇంత రచ్చ చేయాలా? అని అతడి అభిమానులు తాన్యాను ట్రోల్ చేయగా.. మరికొందరు మాత్రం నటీమణులకు ఇలాంటి మెసేజ్‌లు ఎందుకు పంపుతారంటూ చాహల్‌ను విమర్శిస్తున్నారు.
గతంలో కూడా పలువురు హీరోయిన్లతో యూజ్వేంద్ర చాహల్ కి గతంలో కూడా ఇలాంటి వివాదాలు ఉన్నప్పటికీ, రిసెంట్ గా ఈ వివాదంపై అతడు ఇంకా స్పందించలేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల బిజీలో ఉన్న చాహల్, ఈ ఇష్యూను లైట్ తీసుకుంటారా లేక స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తారా అన్నది చూడాలి.
