నారాయణగూడ, వెలుగు: ఇండ్ల స్థలాల పేరుతో నకిలీ పట్టాలు సృష్టించి మోసం చేసిన బీజేపీ సెంట్రల్ జిల్లా సెక్రటరీ నర్సింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు కరీష్మ జైస్వాల్ డిమాండ్ చేశారు. గురువారం హైదర్‌గూడలో ఆమె మాట్లాడుతూ.. చంగిచర్ల సర్వే నంబర్ 58లో స్థలాలు ఇప్పిస్తామని నమ్మించి వేయికి పైగా పేద కుటుంబాల నుంచి ఆయన కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.
స్థలాలు ఇవ్వట్లేదని, డబ్బులు తిరిగి అడిగితే మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేరు చెప్పి నిందితుడు బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించి సంబంధిత వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు న్యాయం చేయాలని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ఫిర్యాదు
చేస్తామన్నారు.
