ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ భవనం కోసం ఇటీవల ప్రభుత్వం స్థలం కేటాయించగా.. భవన నిర్మాణానికి ఆ పార్టీ శ్రేణులు భారీగా విరాళాలు అందిస్తున్నారు.
కాంగ్రెస్ అదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి రూ.5.51 లక్షలు, మాజీ మంత్రి చిలుకూరి రామచంద్రారెడ్డి సోదరుడు చిలుకూరి లక్ష్మారెడ్డి రూ. 5.30 లక్షల విరాళాన్ని సోమవారం డీసీసీ అధ్యక్షుడు నరేశ్ జాదవ్ కు అందించారు. పార్టీ కోసం విరాళాన్ని అందించిన కాంగ్రెస్ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
