తుర్క కాశీలకు అండగా ఉంటాం : మంత్రి అజారుద్దీన్

తుర్క కాశీలకు అండగా ఉంటాం : మంత్రి అజారుద్దీన్

వనపర్తి/కొత్తకోట, వెలుగు: తుర్క కాశ కమ్యూనిటీ సభ్యులు కష్టమైన వృత్తిలో జీవనోపాధి పొందుతున్నారని, ప్రభుత్వం అందిస్తున్న జనరేటర్లు, టూల్ కిట్లు వారికి ఎంతో ఉపయోగపడతాయని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి మహమ్మద్​ అజారుద్దీన్​ అన్నారు. సోమవారం వనపర్తి జిల్లా కొత్తకోటలోని ఏటీఆర్ కన్వెన్షన్ హాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తుర్క కాశ ముస్లిం వర్గాలకు యాంత్రిక పనిముట్లను అందజేసే రాష్ట్ర స్థాయి పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాతుడూ క్రికెట్ ఆడటం సులువు.. కానీ రాయి కొట్టే పని ఎంతో కష్టమైందని, ఆ కమ్యూనిటీ నుంచి వచ్చిన సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సహకరిస్తుందన్నారు. 

ప్రభుత్వం విద్యారంగానికి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. దీనిలో భాగంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి కొత్తకోటలో ప్రభుత్వ స్కూల్ ప్రారంభించినట్లు గుర్తుచేశారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియోజకవర్గానికి చెందిన 90 మంది తుర్క కాశ కమ్యూనిటీ లబ్ధిదారులకు రూ.54 లక్షలతో(ఒక్కో లబ్ధిదారునికి రూ.60 వేల విలువైన యూనిట్) జనరేటర్లు, టూల్ కిట్లను పంపిణీ చేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, అడిషనల్​కలెక్టర్ ఖీమ్యానాయక్, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, కొత్తకోట మున్సిపల్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ పల్లవి, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రశాంత్, తుర్క కాశ కమ్యూనిటీ అధ్యక్షుడు బడే సాబ్, తదితరులు పాల్గొన్నారు.