మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: జిల్లాలో ఆయిల్‌పామ్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా హామీ ఇచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో హార్టికల్చర్ అధికారులు, ఆయిల్‌పామ్ రైతులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ తోటల మీదుగా ఉన్న హైటెన్షన్, లోటెన్షన్ విద్యుత్ లైన్ల వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉందని, వాటిని తొలగించాలని రైతులు వినతిపత్రం అందజేశారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 249 మంది రైతులకు చెందిన 1,090 ఎకరాల ఆయిల్ పామ్ తోటల్లో విద్యుత్ లైన్ల సమస్య ఉన్నట్లు అధికారులు ఆమె దృష్టికి తీసుకువచ్చారు.
