ములుగు: ఆపరేషన్ ముస్కాన్ 138 మంది చిన్నారులకు విముక్తి

ములుగు: ఆపరేషన్  ముస్కాన్ 138 మంది చిన్నారులకు విముక్తి

ములుగు, వెలుగు: ఆపరేషన్  ముస్కాన్​ ద్వారా138 మంది చిన్నారులను కాపాడినట్లు ముస్కాన్  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి, డీసీఆర్బీ డీఎస్పీ ఈ.కిశోర్ కుమార్  తెలిపారు. ములుగులో సోమవారం ఆపరేషన్  ముస్కాన్  ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల కార్మికులు, ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను గుర్తించి కాపాడామని చెప్పారు. 

86 మంది బాలికలు, 52 మంది బాలురు ఉన్నారని, 24 మంది బాలకార్మికులు, 112 మంది డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అవుట్  పిల్లలు, ఒక రన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవే చైల్డ్, మరో అనాథ బాలుడు ఉన్నారని వెల్లడించారు. వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. బాల కార్మికులను పనిలో పెట్టుకున్న 8 మంది యజమానులపై కేసులు నమోదు చేశామని చెప్పారు. డీఎల్​వో వి.వినోద, డీడబ్ల్యూవో ప్రేమలత  పాల్గొన్నారు.