తప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు భయమెందుకు: డీకే అరుణ

తప్పు చేయనప్పుడు బీఆర్ఎస్ లీడర్లకు భయమెందుకు: డీకే అరుణ

సీబీఐ దర్యాప్తుపై బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణపై స్పందించిన డీకే అరుణ.. అసలు తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరమే లేదన్నారు. ఎమ్మెల్యేలుగా కనీస గుర్తింపు లేని వారు కూడా...కేసీఆర్ మెప్పు కోసం ఏదిపడితే అది మాట్లాడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత విచారణ కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు ఆమె నివాసానికి  చేరుకున్న అధికారులు దాదాపు 5 గంటలుగా కవితను ప్రశ్నిస్తున్నారు. మహిళా అధికారులతో కూడిన ఆరుగురు సభ్యుల సీబీఐ టీం.. 160 సీఆర్పీసీ కింద కవిత స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు.