
ప్రపంచంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోలేని వారు తెలంగాణ వాళ్లే అన్నారు.. మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్. సెప్టంబర్ 17 ను అధికారికంగా జరపాలి డిమాండ్ చేశారు. కెసిఆర్ ఎవరికి భయపడి జరపడంలేదో చెప్పాలన్నారు. సెప్టెంబర్ 17 న నిర్మల్ లో జరిగే అమిత్ షా సభకు జనం పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు ఈటల. దీనికి సబంధంచి కరీంనగర్ జిల్లా జమ్మికుంట వినాయక గార్డెన్ లో జరిగిన.. బిజేపి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు ఈటల.