పర్మిషన్ లేకుండా పోలీసులు పబ్లిక్ ఫొటోలు తీస్తున్నరు

పర్మిషన్ లేకుండా పోలీసులు పబ్లిక్ ఫొటోలు తీస్తున్నరు
  • ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ వాడకాన్ని నిషేధించాలె 
  • బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి డిమాండ్ 

హైదరాబాద్, వెలుగు: సిటీలో పోలీసులు పబ్లిక్​ పర్మిషన్ ​లేకుండా ఫొటోలు తీస్తున్నారని, అలా చేయడం చట్ట వ్యతిరేకమని, ఫేషియల్ రికగ్నైజేషన్‌‌‌‌‌‌ వాడకం నిషేధించాలని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ టెక్నాలజీని వాడటం ఖైదీల గుర్తింపు చట్టం– 1920 ప్రకారం గోప్యతా హక్కును ఉల్లంఘించినట్టేనని శుక్రవారం ఆయన ప్రెస్​నోట్​రిలీజ్​చేశారు.  ఓ వ్యక్తిని అరెస్టు చేసినా లేదా దోషిగా నిర్ధారిస్తే తప్ప పోలీసులు ఫొటోలు లేదా వేలిముద్రలు తీసుకోరాదని, అందుకు క్రిమినల్ చట్టం అనుమతించదని పేర్కొన్నారు.  టెక్నాలజీని ఉపయోగించి అధికార పార్టీ ప్రత్యర్థులను అణచివేసేందుకు కుట్ర చేసే ఛాన్స్ ఉందని అనుమానం వ్యక్తం చేశారు.  ఇప్పటివరకు రాష్ట్రంలో టెక్నాలజీ వాడకంపై ఎలాంటి నియమాలు, గైడ్ లైన్స్ లేవన్నారు. సిటీ పోలీసులు మాస్క్‌‌‌‌లను తొలగించి వీధుల్లో ఫొటోలు తీయాలని పౌరులను కోరుతున్నారని ఆయన గుర్తు చేశారు.