న్యూఢిల్లీ: ఢిల్లీ హజ్ కమిటీ చైర్‌పర్సన్‌గా బీజేపీ లీడర్ కౌసర్ జహాన్ ఎన్నికయ్యారు. గురువారం నిర్వహించిన ఎన్నికలో 2 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థిపై ఆమె గెలిచారు. ఈ పోస్టుకు ఎన్నికైన రెండో మహిళగా కౌసర్ నిలిచారు. ఢిల్లీ సెక్రటేరియెట్‌లో జరిగిన ఎన్నికలో కమిటీ సభ్యులు వేసిన 5 ఓట్లలో ఆమెకు 3 ఓట్లు పడ్డాయి. కమిటీలో మొత్తం ఆరుగురు సభ్యులున్నారు. ఆప్, బీజేపీ నుంచి ఇద్దరు చొప్పున, ముస్లిం మత శాస్త్ర నిపుణుడు మహమ్మద్ సాద్, కాంగ్రెస్ కౌన్సిలర్ నాజియా డానిష్‌తో పాటు బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ఉన్నారు. ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా మాట్లాడుతూ, హజ్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు జహాన్‌కు అభినందనలు తెలిపారు.
