V6 News

నన్ను ఒడగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించిండు : విజయశాంతి

నన్ను ఒడగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించిండు : విజయశాంతి

రాష్ట్రం రాంగ్ పర్సన్ చేతుల్లోకి వెళ్లిందని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. కేసీఆర్కు మరోసారి అధికారమిస్తే రాష్ట్రంలో ప్రజలు బతకలేని పరిస్థితులు వస్తాయన్నారు. కేసీఆర్ ఒక విష సర్పం అని.. రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. విజయశాంతి రాజకీయాల్లోకి వచ్చి 25ఏళ్లు పూర్తైన సందర్భంగా మన రాములమ్మ రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్, కిషన్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి సహా పలువురు పాల్గొన్నారు. కేసీఆర్కు అభద్రతాభావం ఎక్కువైందని విజయశాంతి అన్నారు. తాను కనబడొద్దని కేసీఆర్ అనుకున్నారని.. అందుకే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన రోజే తనను సస్పెండ్ చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల్లో తనను ఓడగొట్టేందుకు కేసీఆర్ ప్రయత్నించారన్నారు. ఎన్ని బాధలు పడ్డా మనుసులోనే దాచుకున్నట్లు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తలు కష్టపడి పనిచేస్తే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.