పథకాల పేరుతో పైసలు ఇస్తూ.. లిక్కర్ పేరుతో లాక్కుంటున్నారు

పథకాల పేరుతో పైసలు ఇస్తూ.. లిక్కర్ పేరుతో లాక్కుంటున్నారు

ప్రధాన మంత్రి మోడీ కఠిన నిర్ణయాల వల్లే కరోనా వైరస్ కంట్రోల్లో ఉందన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత వివేక్ వెంక‌టస్వామి. 130 కోట్ల పాపులేష‌న్ లో 40 వెల కేసులు మాత్రమే వచ్చాయంటే మోడీకి మనం హ్యాట్సాఫ్ చెప్పాలన్నారు. కరోనా వైరస్ నివారణకు పారాసెటమాల్, బ్లీచింగ్ వేస్తే వైరస్ రాదని సీఎం కేసీఆర్ అన్నార‌ని, అయ‌న‌ నిర్ణయాలు సరిగలేకనే రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగాయ‌న్నారు. గప్పాలు కొట్టడంలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ నీ మించినోల్లు లేరని.. మోడీ తెలంగాణకు కరోనా కోసం 7 వేల కోట్లకు పైగా నిధులు ఇచ్చారని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఉద్యోగులకు జీతాలు కట్ చేయలేదని..మన ముఖ్యమంత్రి కేసీఆరే మన ఉద్యోగుల జీతాలు కట్ చేశాడని చెప్పారు. కరోనా టైంలో కాళేశ్వరం మూడో టీఎంసీ కోసం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని కమీషన్ లను కొట్టేందుకు టెండర్లు పిలిచారని తెలిపారు వివేక్ వెంక‌ట‌స్వామి.

కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకోవడంపై దృష్టి లేదుగానీ, కమీషన్ ల కోసం మాత్రం టెండర్లను పిలిచారని తెలిపారు. కమిషనలను యెట్లా దొబ్బలనే దానిపైనే ఎప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి ఉంటుందన్నారు. 36 కోట్ల ప్రాజెక్ట్ ను లక్ష కోట్లకు పెంచారని.. ధనిక రాష్ట్రాన్ని అప్పులు రాష్ట్రంగా సీఎం కేసీఆర్ మార్చారని చెప్పారు. ధనిక తెలంగాణను రూ. 3 లక్షల కోట్ల అప్పుల తెలంగాణగా చేశారని ..కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. కళ్ళ బొల్లి మాటలు చెబుతున్న సీఎం.. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా మారుస్తున్నాడన్నారు. పథకాల పేరుతో పైసలు ఇస్తూ లిక్కర్ పేరుతో మళ్లీ ప్రజల డబ్బును వెనక్కు తీసుకుంటున్నాడ‌ని చెప్పారు. ఖబర్దార్ సీఎం కేసీఆర్, మీరు కమిషన్ కొట్టేస్తూ ప్రజలపై భారం మోపద్దన్నారు. ప్రజలు బాధ పడొద్దనే, వాస్తవాలు చెప్పాలనే భాద్యతగా అన్ని విషయాలను ప్రజలకు భారతీయ జనతా పార్టీ చెబుతుందన్నారు వివేక్ వెంక‌ట‌స్వామి.