బీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు

బీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారు : కూనంనేని సాంబశివరావు

కేసీఆర్ సర్కార్ పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. లక్షమందితో హైదరాబాద్ ను ముట్టడిస్తామని చెప్పారు. కేంద్రం వాటా కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్తామన్న కూనంనేని... కమ్యూనిస్టుల పవర్ ఏంటో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ఓ నియంత అని, మోడీ పేదలకు వ్యతిరేకంగా మారారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే ఈడీలతో దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్, మోడీ ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. 

బీజేపీ నేతలు మతం పేరుతో ఉన్మాదుల్లా ప్రవర్తిస్తున్నారని కూనంనేని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నగరాల పేర్లు మారుస్తోందని, అమిత్ షా పేరులో షా అనేది పర్షియా పదం...మరి ఆయన పేరు మార్చుకుంటారా అని ప్రశ్నించారు. సంజయ్ మీతండ్రి పెట్టిన పేరు మారిస్తే ఊరుకుంటారా..? అని కూనంనేని నిలదీశారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకే పేర్లు మారుస్తున్నారని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని సంస్థలను అమ్మేస్తోందని, కరోనా పేరుతో రైల్వే రాయితీలు తీసేశారని చెప్పారు.