డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలి: బీజేపీ నాయకులు

డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించాలి: బీజేపీ నాయకులు

ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సికింద్రాబాద్ ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ పద్మారావు ప్రజలను మోసం చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు జరపకుండా ఆలస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇందుకు నినసనగా బీజేపీ నాయకులు డిప్యూటీ స్పీకర్ పద్మారావు కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు.

దీంతో డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఆందోళన కారులను కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పొంతనలేని వాగ్దానాలు చేస్తూ.. ప్రజలను మభ్యపెట్టడంలో పద్మారావు మించిన నాయకుడు లేరని బీజేపీ నాయకులు విమర్శించారు. 

పదివేల డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మిస్తామని చెప్పి.. కట్టిన 500 ఇల్లను కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు.. దళిత బంధు, బీసీ బంధు పూర్తిస్థాయిలో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. లబ్ధిదారులకు అండగా ఉంటూ..బీజేపీ వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.