జూనియర్ ​డాక్టర్ల సమ్మెకు బీజేపీ నేతల సంఘీభావం

జూనియర్ ​డాక్టర్ల సమ్మెకు బీజేపీ నేతల సంఘీభావం

స్టైఫండ్  పెంచాలని డిమాండ్​ చేస్తూ రామాంతపూర్​లో హోమియో జూనియర్​ డాక్టర్లు చేస్తున్న సమ్మె ఎనిమిదో రోజుకి చేరింది. వారి సమ్మెకు బీజేపీ మాజీ ఎమ్మెల్యే, ఎన్​వీఎస్​ఎస్​ ప్రభాకర్, కార్పొరేటర్లు బండారి శ్రీవాణి, చేతనా హరీశ్ సంఘీభావం తెలిపారు. 

వారికి మద్దతుగా సమ్మెలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమ్మె విషయం ప్రభుత్వానికి తెలిసినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని ప్రభాకర్​ ఆరోపించారు. స్టైఫండ్ పెంచుతామని రాతపూర్వకంగా హామీ ఇచ్చి ఎనిమిదేళ్లవుతున్నా పెంచకుండా వీరి జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు. 

పక్క రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ ఇచ్చే స్టైఫెండ్​ చాలా తక్కువగా ఉందన్నారు. ప్రభుత్వం నిరసన కారులకు లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని డిమాండ్​ చేశారు. లేదంటే బీజేపీ ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు.