హైదరాబాద్: 2021-22 ఆర్థిక సంవత్సరానికిగానూ తెలంగాణ బడ్జెట్‌ను 2,30,825.96 కోట్ల రూపాయల అంచనాతో అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్ ప్రవేశ పెట్టారు. బడ్జెట్‌పై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. బడ్జెట్ పుస్తకాలకే పరిమితం..అమలు చేయరని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. గురువారం రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ.. మూసీ నదికి కేటాయించిన కోట్లు ఎటుపోయాయని ప్రశ్నించారు. క్రీడా రంగానికి ఒక్క రూపాయి కేటాయించలేదని సీరియస్ అయ్యారు. ఎల్బీ స్టేడియం షాపింగ్ కాంప్లెక్స్‌గా తయారైందన్న రాజాసింగ్..హెల్త్ కోసం భారీగానే కేటాయింపులు చేశారన్నారు. కానీ అవి ఎక్కడ ఖర్చుచేస్తారో చూడాలన్నారు. ఉస్మానియా హాస్పిటల్ కట్టడానికి వందల కోట్లు ఖర్చు చేస్తామన్నారు. రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మూసీ సుందరీకరణ కోసం.. కోట్లు ఖర్చు చేస్తాం అన్నారు. ఇప్పటికీ అవి ఖర్చుచేయలేదన్నారు. నగరంలోని దూల్ పేటలో గుడుంబా నివారణ చేసి.. వారికీ ఉపాధి కల్పిస్తామన్నారు. ఎవ్వరికీ ఉపాధి కల్పించలేదన్నారు. తెలంగాణ ప్రజలు సమావేశాలను సీరియస్ గా చూస్తున్నారన్నారు రాజాసింగ్.

