హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మక్కజొన్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, కౌలు రైతులు పండించిన మక్కలను ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేయాలని బీజేపీ ఎమ్మెల్సీ డాక్టర్ చిన్న మైల్ అంజిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ మేరకు గురువారం ఆయన సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల ఎకరాల్లో మక్కజొన్న సాగు చేయగా, ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పరిధిలో 3.20 లక్షల మంది రైతులు ఈ పంటను వేశారని తెలిపారు.
