దాడికి కారణం డీజీపీనే : అర్వింద్

దాడికి కారణం డీజీపీనే : అర్వింద్

డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి పోలీస్ బాస్ ను ఇప్పటి వరకు చూడలేదని ఎంపీ అర్వింద్ అన్నారు. ఆయన అమ్ముడుపోయిన సరుకని విమర్శించారు. ఎంపీలపై ఎన్నోసార్లు దాడులు జరిగినా పట్టించుకోలేదని ఆరోపించారు. మహేందర్ రెడ్డికి ఏం చేతకాదన్న అర్వింద్.. దాడి ఘటనలో తప్పు ఆయనదేనన్నారు. ఒక ఎంపీ ఇంటిపై దాడి జరుగుతుంటే రక్షణ కల్పించకుండా..  డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. గతంలో కూడా ఎంపీలపై దాడులు జరిగాయని.. తనపై దాడి జరగడం కొత్తేం కాదని చెప్పారు. 

ఎమ్మెల్సీ కవితపై తాను ఏం అనుచిత వ్యాఖ్యలు చేశానో చెప్పాలని అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ రోజు పక్కన కూర్చున్న ఎమ్మెల్యేలే ఆమెను ఓడగొట్టారని అన్నారు. మల్లిఖార్జున్ ఖర్గేకు ఫోన్ చేశారో లేదో చెప్తే సరిపోయేదని, కవిత పనులు చూసే ఇందూరు ప్రజలు ఆమెను ఓడించారని అన్నారు. రాజకీయ జీవితం ముగిసిందనే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని అర్వింద్ అభిప్రాయపడ్డారు. అసలు బీజేపీ నుంచి కవితను ఎవరు సంప్రదించారో పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎవరూ తనను వెంటాడాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఈ సారి ఎన్ని్కల్లో ఇందూర్ పార్లమెంట్ లోనే బరిలో దిగుతానని స్పష్టం చేశారు. గెలుస్తానని నమ్మకం ఉంటే పోటీకి రావాలని కవితకు సవాల్ విసిరారు. రెండోసారి కూడా ఎంపీగా గెలుస్తానని అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.